విశాఖ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదంలో 11 మంది మృతి

car

 

విశాఖపట్నం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టి అదుపు తప్పి.. డివైడ్ దాటి.. అటువైపు దూసుకెళ్లింది. అదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీ కారును ఢీ కొనడంతో కారు నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తి సహా .. 11 మంది మృతి చెందారు.

ఈ సంఘటన ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ముదుళ్లపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వైజాగ్ నుంచి తుని వెళ్తున్న AP16BZ 5624 నంబర్ కారు ముదుళ్లపాలెం వద్దకు రాగానే అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత  డివైడర్‌ను దాటి అటునుంచి వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది.

car 3

ఈ ఘటనలో  బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు, కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. టైరు పంక్చర్ కావడంతోనే కారు అదుపు తప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

car 2

నక్కపల్లి రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని తక్షణమే గుర్తించి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను చినరాజప్ప ఆదేశించారు. ( news from Sakshi, photo from Eenadu)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s